ఆధ్యాత్మికం

భక్తులందరికీ చేరేలా ఏర్పాట్లు

406 Views

–రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు నర్సింగారావు.

(తిమ్మాపూర్ డిసెంబర్ 19)

అయోధ్య లోని శ్రీరామ మందిరం నుండి వచ్చినటువంటి అక్షింతలు గ్రామాల్లోని భక్తులందరికీ చేరేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తిమ్మాపూర్ ఖండ సభ్యులు దరిపెల్లి నర్సింగారావ్ పేర్కొన్నారు.

అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కరినగర్ నుండి స్వయం సేవక్ సభ్యుల ద్వారా ఆవుల కుమార్ నేత్రుత్వం లో మంగళవారం తిమ్మాపూర్ మండలం లోని నుస్తులాపూర్ గ్రామానికి తీసుకువచ్చారు.ఊరి బయట ఉన్న గ్రామ పంచాయతీ నుండి శివాలయం వరకు మేళ తాలాలతో,డప్పు చప్పుల్ల తో మంగళహారతులతో గ్రామ పెద్దలు వాటిని నెట్టిన పెట్టుకొని ఊరేగింపుగా తీసుకొచ్చి శివాలయం లో ఊరుమడ్ల కిరణ్ శర్మ నేత్రుత్వం లో పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ…

అయోధ్య లోని రామ మందిరం నిర్మాణం కోసం ఇంటింటికి తిరిగి నిధి ని సేకరించిన తరహాలోనే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ప్రతీ ఇంటికి చేరేలా గ్రామం లోని భక్తులు, వివిధ క్షేత్రాలకు సంబందించిన ప్రతినిధులు యోజన చేసుకొని అక్షింతల పంపిణి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

అయోధ్య లో రాం మందిరం నిర్మాణం కోసం ఎంతో మంది కర సేవకులు ప్రాణాలు కోల్పోయరని ఇప్పటికైనా అయోధ్యలో రాం మందిర నిర్మాణం పూర్తికావడం హైందవ జాతి చిరకాల కోరికని ట్రస్ట్ సభ్యులు రామారావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చిగురుమామిడి,గన్నేరువరం మండలాలకు చెందిన వివిధ క్షేత్రాలకు చెందిన ముఖ్య నాయకులు, పార్టీలకు చెందిన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
కొమ్మెర రాజు తిమ్మాపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *