గృహ ప్రవేశాలకు హాజరైన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు
ఎల్లారెడ్డిపేట డిసెంబర్ 17 :
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం జరిగిన వివిధ శుభకార్యాల్లో ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు పాల్గొన్నారు,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ 77 వ బూత్ కమిటీ సభ్యులు మద్దుల తిరుపతి రెడ్డి నిర్వహించిన నూతన గృహప్రవేశానికి అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు నాగుల ప్రదీప్ గౌడ్ నిర్వహించిన నూతన గృహప్రవేశానికి వివిధ శుభ కార్యాలకు ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు హాజరై ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు,వారి అతిధ్యాన్ని స్వీకరించారు గృహప్రవేశం చేయడమంటే ఓ మంచి శుభకార్యం అని కొనియాడారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సెస్ డైరెక్టర్ వర్శ కృష్ణ హారి , సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, శ్యామంతుల అనిల్ వార్డు సభ్యులు కొడిమోజూ దేవేందర్, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు హాసన్ బాయి, గంట వెంకటేష్ గౌడ్ హాజరయ్యారు




