ప్రాంతీయం

హార్ట్ బీట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు అవగాహన

248 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 16)

హైద్రాబాద్ హార్ట్ బీట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని జూలూరుపాడులో గల సాయి ఎక్స్ లెంట్ స్కూల్ నందు విద్యార్ధినీ విద్యార్ధులకు శనివారం నేత్రం ఆవశ్యకతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హార్ట్ బీట్ ఫౌండేషన్ అధినేత రాకేష్ మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే మానవ శరీరంలోని అన్ని అవయావాల్లో కెల్లా కన్ను అనే అవయం అత్యంత ప్రధానమైనది. నాకు కళ్ళు లేకపోవడం వల్ల ఎన్నో రకాల ఇబ్బంది పడుతూ నేను బ్రెయిన్ లెఫ్ట్ ద్వారా లా కంప్లీట్ చేసి ఉన్నత స్థానానికి ఎదిగానని గుర్తు చేశారు. అలాంటిది అన్ని అవకాశాలు ఉండి, కళ్ళు ఉన్న మీరు అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించి మంచి ఉన్నత స్థాయికి చేరుకుని అటు తల్లిదండ్రులకు, ఇటు పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకుని వచ్చి, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. అదే విధంగా రాబోయే తరానికి కాబోయే యువత మీరేనన్న విషయం గుర్తు పెట్టుకుని విద్యలో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు నాగవేణి, మధు, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *