-ముంజంపల్లి గ్రామంలో “నా మట్టి-నా దేశం” కార్యక్రమం..
బుధవారం మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు.. “నా మట్టి- నా దేశం ” కార్యక్రమంలో భాగంగా ముంజంపల్లి శక్తికేంద్ర ఇంచార్జీ మొగిలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బ్యాండ్ వాయిద్యాలతో ర్యాలీగా ఇంటింటికి తిరుగుతూ మట్టిని సేకరించారు. అనంతరం హనుమాన్ దేవాలయంలో మట్టి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి నియోజవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు హాజరై మాట్లాడుతూ
ప్రపంచంలో కెల్లా మట్టిని తల్లిగా, దైవంగా పూజించే ఏకైక దేశం భారతదేశం అని కొనియాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ అమృతోత్సవాలలో భాగంగా భారత స్వాతంత్ర సమరయోధులకు మరియు అమర జవాన్ల స్మారకంగా ఢిల్లీలోఅమృత వాటికను నిర్మిస్తున్నారని ఈ యొక్క అమృత వాటికకు ప్రతి గ్రామం నుండి మట్టిని సేకరిస్తున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సిరిసిల్ల చంద్రయ్య, మండల ప్రధాన కార్యదర్శి సోన్నాకుల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు శీలం కుమార్ యాదవ్, మండల కార్యదర్శి చొప్పరి అశోక్,ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్, బల్ల అంజి, ముంజంపల్లి బూత్ అధ్యక్షులు పిట్టల నరేష్, కుమార్, పిట్టల అనిల్, అజయ్, సురేష్, సంపత్, మహిళలు పాల్గొన్నారు.