ప్రాంతీయం

కేకే, మహేందర్ రెడ్డిపై విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం…

371 Views
  ముస్తాబాద్, డిసెంబర్ 13 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు ఏల్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ పై బిఆర్ఎస్ నేతలు వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ ఈ సందర్భంగా ఏల్లబాల్ రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు కూడా రేవంత్ రెడ్డి అడ్డు వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రైతుబంధు వద్దందని పలు విమర్శలు చేశారు. పత్రిక సమావేశంలో రైతుబంధు ఇవ్వండని రేవంత్ రెడ్డి చెప్పారు. చేతగాక మాట్లాడే విధానం లేకనే ఈసీ ద్వారా కొరడా దెబ్బలు పడ్డారని రైతుబంధు ఇవ్వని దుస్థితి మీ బిఆర్ఎస్ ప్రభుత్వం దని మండిపడ్డారు. ఇవాళ తమ పార్టీని  కేటీఆర్ ను కేకే మహేందర్రెడ్డి తప్పక విమర్శిస్తారు. మీకు చేతగాక ప్రజలకు సక్రమంగా సేవలు అందించలేరని విమర్శిస్తే సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య కళ్ళులేని కబోది కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడడం సరి కాదన్నారు. ఆగయ్య ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మీరు దాడులు చేస్తే ప్రతిదాడులకు దిగుతామని తెలిపారు. 2014లో గెలిచినప్పుడు ముస్తాబాద్ మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల 30 పడకల ఆసుపత్రి మినీ స్టేడియం మొదలు పెడుతున్నామని ప్రతిసారి ఫోటోలు ఫోజులిచ్చుకుంటూ ఫోటోలకు పాలు పోసుకుంటూ కాలయాపన చేస్తున్న ప్రభుత్వం మీద అన్నారు. పెళ్లయిన వారికి కనీసం రేషన్ కార్డులు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా యువతి యువకులు ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు శోకం మిగిల్చారు. ఇదికాదా మీ చాతగాని ప్రభుత్వం మన్నారు. రాష్ట్ర ప్రజలంతా గ్రహించి మీ ప్రభుత్వము పాలనలో విప్లమైందని ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పట్టుమని పది రోజులు కాకముందే ప్రభుత్వంపై అన్ని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక హుజరాబాద్ లోనె దళితులు ఉన్నారా ఇంకెక్కడ లేరా పైసలు పంచుతామన్న పేరుతో ఓట్లు దండుకోవాలని దుర్బుద్ధితో కేవలం ఒక హుజురాబాద్ లో దళిత బంధు పేరుతో డబ్బులు ఆశచూపి అకౌంట్ లో వేసినట్టే వేసి అకౌంటు బ్లాక్ చేయించి


పంచితే అప్పుడు కూడా ప్రజలు చెంప చెల్లుమనిపించారు ఇది చాలదా మీ బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంకెన్ని అవమానాలు జరిగిన సిగ్గుచేటు అన్నారు. 2018లో లక్ష రుణమాఫీ చేస్తానని ప్రజలను మోసంచేసి గద్దెనెక్కి రుణమాఫీ చేయలేక మళ్ళీ 2023న ఎన్నికలు సమీపిస్తున్నందున నాడు ఇచ్చిన మాట తప్పినామని నాలుగున్నర సంవత్సరాలకు రుణమాఫీ గుర్తొచ్చిందా ప్రజలను మభ్యపెట్టడానికి పన్నాగాలు చేసే ప్రభుత్వం మీదికాదా అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఓట్ల కొరకు అనేకమైన నెలకో దొంగ హామీల బిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని తెలిపారు. మరోసారి బిఆర్ఎస్ నాయకులు ఆగయ్య కాంగ్రెస్ పార్టీ కేకే మహేందర్ రెడ్డి పైన పలు విమర్శలు చేస్తే రాజకీయపరంగా ఉండాలిగాని వ్యక్తి పరంగా చేస్తే ఖబర్దార్ బిడ్డా తోటలయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, తలారి నర్సింలు, కొప్పు రమేష్, కొమురయ్య, ఉచ్చిడి బాల్ రెడ్డి, బొందుగల దేవి రెడ్డి, మిరుదొడ్డి భాను, సోషల్ మీడియా ఎదునూరి భానుచందర్, నవీన్, సద్ధి మధు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *