ఎల్లారెడ్డిపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల, పోలీసుల వివరాలు ప్రకారం మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన షేక్ సలీం(55) అనే వ్యక్తి బొప్పాపూర్ గ్రామ శివారులో ఉన్న భారత్ పెట్రోల్ పంపు లోకి పెట్రోల్ పోసుకోవడానికి బుధవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో వస్తుండగా, అదే గ్రామానికి చెందిన లంబ రమేష్ అనే వ్యక్తి సలీం ను అతివేగంతో అజాగ్రత్తగా ఢీకొట్టాడు. ఈ సంఘటనలో సలీం తలకు తీవ్ర గాయాలు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
