మంచిర్యాల జిల్లా
లంచం అడుగుతే ఈ నెంబర్ కు 1064 లేదా 9440446106 కాల్ చేయండి.
గవర్నమెంట్ అధికారులు లంచం అడుగుతే ఏసీబీ అధికారులను సంప్రదించవలసినదిగా అవినీతి నిరోధక శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిఎస్పి విజయ్ కుమార్ ప్రజలకు సూచించారు. గురువారం నిర్మల్ లో ఆర్ ఐ తో పాటు ఇంకొక ఉద్యోగిని పట్టుకోవడం జరిగింది. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నగదు ఆశిస్తే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు 1064 లేదా 9440446106 ఫోన్ చేయండి. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ మరియు మంచిర్యాల లో ప్రజల సౌకర్యార్థం కోసం ఏసీబీ ఆఫీసులను ఓపెన్ చేయడం జరిగిందని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ డిఎస్పి విజయ్ కుమార్ తెలియజేశారు.
