ప్రాంతీయం

జిల్లా కేంద్రంలో మెగా హెల్త్ క్యాంపు 

130 Views

జిల్లా న్యాయ సేవల అధికార సంస్థ వరల్డ్ డెఫ్ డే

 

ములుగు జిల్లా, సెప్టెంబర్ 23

 

ములుగు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ డెఫ్ డే సందర్భంగా డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ములుగు ఆధ్వ ర్యంలో మెడికల్ హెల్త్ క్యాప్ జిల్లా కోర్ట్ ప్రాంగణంలో నిర్వ హించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి పీవీపీ లలిత శివ జ్యోతి పాల్గొని మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పారని మనం అందరం నిత్యజీవితంలో పను ల్లో భాగంగా మనం మన ఆరోగ్యంను పట్టించుకోము ఉద్యోగంతో పాటు ఆరోగ్యం పై కూడా శ్రద్ధ వహించాలని మనము ఆరోగ్యంగా ఉన్న ప్పుడే ఏదైన పనిని సక్రమంగా చెయ్యగలుగుతామని కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ చెకప్ చేయించుకోవాలి ఈ అవకా శాన్ని ప్రతి ఒక్కరు వినియోగిం చుకోవాలి అని తెలియజేశారు. ఈ సందర్బంగా డిఎమ్ అండ్ హెచ్ఓ డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ ప్రతి రోజు వ్యాయామం చేస్తే మనం అందరం ఆరోగ్యంగా ఉండగ లుగుతాము వ్యాయామం నిత్య జీవితంలో ఒక భాగంగా అలవాటుచేసుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా న్యాయమూ ర్తులకు న్యాయవాదులకు కోర్టు సిబ్బందికీ సుమారుగా 100 మందికి రాండోమ్ బ్లడ్ చక్కర వ్యాధి పరీక్ష, కంప్లీట్ బ్లడ్ పరీక్షలు,సీజనల్ ఫీవర్ మలేరియా డెంగ్యూ పరీక్షలు, లివర్ ఫంక్షనింగ్ తదితర పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి కమ్ సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ టీ మాధవి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి డి.రామమోహన్ రెడ్డి అదనపు జూనియర్ సివిల్ జడ్జి జే.సౌఖ్య,మెడికల్ ఆఫీసర్,డాక్టర్ పి.రవీందర్ రాయినిగూడెం,డాక్టర్. ప్రేమ్ సింగ్ మెడికల్ ఆఫీసర్ రాయినిగూడెం,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి.హెచ్.వేణుగోపాల చారి,బార్ జనరల్ సెక్రటరీ మేకల మహేందర్,న్యాయవాదులు ఆర్.బిక్షపతి,కొండి రవీందర్, సునీల్ విజయ్ కుమార్, మెడికల్ సిబ్బంది,కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *