దౌల్తాబాద్: కేసిఆర్ సేవాదళం గొల్ల కురుమ సంఘం మండల అధ్యక్షుడిగా ముబారస్ పూర్ గ్రామానికి చెందిన తుప్పతి నరేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసిఆర్ సేవాదళం గొల్ల కురుమ సంఘం అధ్యక్షుడుగా నియమించినందుకు ఆర్టీఐ కమిషనర్ అమీర్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు మండల వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తానని, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు….
