ఎల్లారెడ్డిపేట మండలంలో ఒక వ్యక్తి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పట్టుకున్న పోలీసులు. పోలీసుల వివరాలు ప్రకారం మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామ శివారులో పోలీస్ సిబ్బంది వాహన తనిఖీ చేస్తుండగా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి మహేష్ అనే వ్యక్తి తన వాహనంలో ఆదివారం రోజు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ పట్టుకోవడంతో అతనిని వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
