24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 18)
సిద్దిపేట జిల్లా: భార్య మరణం తట్టుకోలేక భర్త చనిపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం అక్కన్నపేట మండలం గండిపల్లి కి చెందిన బైరగోని ఎల్లయ్య, లచ్చవ్వ దంపతులు. అనారోగ్యంతో లచ్చవ్వ శనివారం చనిపోగా భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. లేను ఇంటి వద్దనే ఉంచి కుటుంబీకులు లచ్చవ్వ అంత్యక్రియలకు వెళ్లి వచ్చేసరికి ఆయన చనిపోయి ఉన్నాడు. గంటల వ్యవధిలోనే దంపతుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
