దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శివాజీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బండారులాలు, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ లు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు బహుమతిగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పట్టం కట్టారని తెలిపారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలో భాగంగా నేడు సోనియాగాంధీ జన్మదిన సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా కల్పించడంతోపాటు ఆరోగ్యశ్రీ పథకంను రూ. 10 లక్షలకు పెంచుతూ అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంజనేయులు గౌడ్, రాజు, ఎర్రయ్య, లలిత కృష్ణ, నర్సింహారెడ్డి, సురేందర్, ఏసు, మహేష్, సత్యం, రామస్వామి తదితరులు పాల్గొన్నారు…




