దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెల రెండవ శనివారం నిర్వహించే మాస కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోశ్చరణాల మధ్య స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడంతోపాటు పల్లకి సేవ, అలంకరణ తదితర కార్యక్రమాలను ఆలయ పూజారి వెంకటేశం నిర్వహించారు. కళ్యాణోత్సవంలో మాశెట్టి నవ్య- నరేష్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…
