డిసెంబర్ 9
అప్పుల బాధతో ఉరివేసుకోని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. కుకునూర్ పల్లి ఎస్‌ఐ పుష్ప రాజ్ కథనం మేరకు కుకునూర్ పల్లి గ్రామానికి చెందిన అనుమెల్ల రాజు (30) ఫైనాన్స్‌లో టాక్టర్ కోని నడుపుకుంటూ జీవనం కోనసాగిస్తున్నాడు. టాక్టర్ సరిగ్గా నడవకపోవడంతో ఫైనాన్స్ కట్టడం కోసం తెలిసిన వారి దగ్గర అప్పులు చేసాడు. అప్పుల తీర్చాలేక మనస్థాపంతో ఈ నెల 5 వ తేదిన ద్విచక్ర వాహనం తీసుకోని పని ఉంది అని చెప్పి ఇంట్లోంచి వెళ్లి తిరిగిరాలేదు,ఫోన్ చేసిన లిఫ్ట్ చెయ్యలేదు. శనివారం నాడు కుకునూర్ పల్లి మండలం మెదిన్ పూర్ గ్రామ శివారు లోని మర్రిచెట్టు కు ఉరివేసుకోని విగతా జీవి గా పడి ఉన్నాడు.
