ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్15, తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ గనప శివజ్యోతి, ఎంపీటీసీ భుస్స స్వప్న లింగం, ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి 17వ తేదీన సిరిసిల్లలో జరిగే తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని ఎంపీపీ మానస పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో తంగళ్ళపల్లి ఎంపీటీసీ కోడి అంతయ్య, సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, గనప మదన్ మోహన్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి, ఉపసర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు,వార్డ్ సభ్యులు పెద్ది రఘు, పసుల శేఖర్ బాబు, తంగళ్లపల్లి మహేష్ బూత్ అధ్యక్షులు పెద్దిరాజు, బండి భాస్కర్, బిఆర్ఎస్ నాయకులు గుర్రం కిషన్ గౌడ్ రాగిపెల్లి కిష్టారెడ్డి, కడారి శ్రీను, తంగళ్లపల్లి శ్రీనివాస్, లింగంపెల్లి రాజు, పెద్ది అబ్బాస్, రాజు, అమరగొండ ప్రశాంత్, కొమ్మెట శంకర్, ఫాజుల్, ఒగ్గుదేవయ్య పాల్గొన్నారు.
