రామగుండం పోలీస్ కమిషనరేట్
మావోయిస్టు ప్రభావిత ప్రాంత పోలింగ్ కేంద్రాలు, ఫెర్రీ పాయింట్స్, అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ అధికారులతో కలిసి సందర్శించిన రెమా రాజేశ్వరి ఐపీఎస్.
ఓటు హక్కును వినియోగించుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలి : జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి ఐదావత్
భారత రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన ఓటు హక్కు ద్వారా సమర్ధవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, ఈ నెల 30న జరుగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ రోజు అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఈరోజు రామగుండం శ్రీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి, ఐపిఎస్., మంచిర్యాల డి.సి.పి. సుధీర్ రామ్నాథ్ కేక్షన్, సి.ఆర్.పి.ఎఫ్. అధికారి దినేష్, 002-చెన్నూర్ రిటర్నింగ్ అధికారి సిదాం దత్తు, అధికారులతో కలిసి జిల్లాలోని వేమనపల్లి మండలంలోని సుంపుటం, కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామాలలో ప్రజలకు ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లాలోని 3 నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికలలో భాగంగా ఈ నెల 30న పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, అర్హత గల ఓటర్లు అందరు తమ ఓటు హక్కు వినియోగించుకొని 100 శాతం పోలింగ్ జరిగేలా సహకరించాలని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకొని మనకు మంచి చేసే సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవచ్చని, భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని అన్నారు. ప్రజలు ఎలాంటి ఒత్తిళ్ళకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా, నిస్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మనకు మంచి చేసే నాయకులను ఎన్నుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా “నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను” అని అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.
సీపీ మేడమ్ మాటాడుతూ కోటపల్లి మండలం సుంపుటం,జాజులపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సీపీ గారు, కలెక్టర్ గారు సందర్శించి, పోలింగ్ రోజు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కోటపల్లి మండలంలోని వెంచపల్లి వద్ద ప్రాణహిత పెర్రి పాయింట్ ప్రాంతంలో పడవలు నడిపించే వారితో, జాలర్లు, పడవలపై వచ్చే ప్రయాణికులతో స్థానిక స్థితిగతులపై విచారించి, ఓటు హక్కు ఓటు విలువపై వివరించడంతో పాటు ఈ నెల 30 పోలింగ్ రోజున ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఫెర్రి పాయింట్స్ వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని నిరంతరం నిఘా ఏర్పాటు ఉంటుంది అన్నారు.
కోటపల్లి మండలం రాపనపల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టును ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఓటర్లను ప్రలోభపెట్టే నగదు, బంగారం, కానుకలు ఇతరత్రా రవాణా కాకుండా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, తనిఖీ చేయు సమయంలో వీడియో చిత్రీకరణ తప్పనిసరిగా చేయాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు లేకుండా అధికంగా నగదు, బంగారం, ఇతరత్రా ప్రలోభ పెట్టే వస్తువులను తరలిస్తున్నట్లయితే వెంటనే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలని, సంబంధిత వ్యక్తులకు వివరాలతో కూడిన రశీదు అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమములో జైపూర్ ఏసీపీ మోహన్, చెన్నూర్ టౌన్ సీఐ వాసుదేవా రావు, చెన్నూర్ రూరల్ సీఐ విద్యా సాగర్, వేమనపల్లి తహశీల్దార్ సదానందం, ఎస్.ఐ. తదితరులు పాల్గొన్నారు.
