42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని నిరసన దీక్ష.
మంచిర్యాల జిల్లా.
ఈ రోజు మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ లో స్థానిక సంస్థల 42% రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాయకులు మాట్లాడుతూ దేశానికి ప్రధానిని బిసిని చేసినం అని గొప్పగా చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ బీసీ ఆకాంక్షలు బీసీల ప్రజాసామికవాటకై ఉద్యమ ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పెడచెవిన పెట్టడం బాధాకరం.ఏ ఉద్యమం లేకుండానే అగ్రకులాలకు EWS పేరుతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 ను ఐదు రోజుల్లో రాజ్యాంగ సవరణ చేసి 10% రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వం బీసీల పక్షపాతాన్ని చెప్పుకుంటున్న ప్రభుత్వం బీసీల న్యాయమైన వాటికై రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి బీసీల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నాం లేని పక్షంలో బిజెపి ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందు ఎండగట్టి బీసీ సమాజం ముందు బిజెపిని దోషుగా నిలబడతామని హెచ్చరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, సీనియర్ నాయకులు కర్ణ శ్రీధర్,రాష్ట్ర నాయకులు గజ్జల వెంకటయ్య, శాకాపురి భీమ్సేన్,పంపరి వేణుగోపాల్,గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు నేనెలా నరసయ్య, పద్మశాలి జిల్లా అధ్యక్షుడు చెలగాని సుదర్శన్,శెట్టిపల్లి గట్టయ్య, కీర్తి బిక్షపతి, ధర్మాజీ మల్లేష్ ,సందనవేని మల్లేష్,చెలిమెల అంజయ్య, గక్కుల సంతోష్,గుమ్ముల లింగయ్య, గాండ్ల రాజకుమార్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.





