ప్రాంతీయం

రెండేళ్ల జైలుశిక్షతో పాటు 2,వేలు జరిమానా…

529 Views
 ముస్తాబాద్, డిసెంబర్7 (24/7న్యూస్ ప్రతినిధి) దాడిచేసిన వ్యక్తికి రెండు సంవత్సరాల జైలుశిక్ష తోపాటు రూ.2, వేలు జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ గురువారం తీర్పు వెలువడించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు 4,అక్టోబర్ 2016 రోజున ముస్తాబాద్  మండలం పోత్గల్ గ్రామానికి చెందిన తలారి రాజు అదే గ్రామానికి చెందిన జంగ భూంరాజుల మధ్య చెట్లను కొట్టుకునే విషయంలో గొడవ జరుగగా. ఆగొడవలో  భూంరాజు రాయితో రాజు తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన రాజుని వెంటనే దవాఖానకి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. జరిగిన సంఘటనపై ముస్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున పి.పి. చెలుమల సందీప్ వాదించగా, కోర్టు కానిస్టేబుల్ దేవేందర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధించారని ముస్తాబాద్ ఎస్సైకె. శేఖర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపినారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *