అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులతో నివాళి
డిసెంబర్ 6
కామరెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం భారతదేశ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి నీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల కేంద్ర ప్రజలు పాల్గొన్నారు.





