*పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి*
*ప్లకర్డ్స్ లతో నిరసన*
ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మంచిర్యాల పట్టణంలోని అమరవీరుల స్తూపం దగ్గర బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్లకార్డ్స్ లతో నిరసన వ్యక్తం చేస్తూ నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న దేశ జనాభాలో 10%లేని అగ్రవర్ణాలు దేశాన్ని రాష్ట్రాన్ని 76 సంవత్సరాలు పాలిస్తున్నారు దేశ జనాభా 60 శాతం ఉన్న బీసీలు అగ్రవర్ణాల చేతిలో పాలించబడుతున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా సామాజిక న్యాయం అని అడుగుతున్నాం పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నుండి 32 పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇచ్చాయి అలాగే తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్నికి పంపినప్పటికీ బిల్లు పెట్టకపోవడం అంటే ఇది పూర్తిగా బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరిగా భావిస్తున్నాం ఏ ఉద్యమం జరగకూడనే అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం గత 40 సంవత్సరాలుగా బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని ఉద్యమాల నడుస్తున్నప్పటికీ బిల్లు పెట్టకపోవడం అంటే పూర్తిగా బీసీ పట్ల కుట్రగా భావిస్తున్నాం ఇప్పటికైనా బీసీలకు రావాల్సిన ప్రజాస్వామ్య వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో రానున్న రోజుల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మెడలు వంచి ఉద్యమాలు చేసి మా వాటా సాధించుకునే దిశగా మా ఉద్యమాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి సంగం లచ్చన్న రాష్ట్ర నాయకులు గజ్జల వెంకన్న. మంచిర్యాల పట్టణ అధ్యక్షులు బోడెంకి మహేష్. శ్రీపతి రాములు ఆరెందుల రాజేశం మొలుగూరి వెంకటేష్ కట్కూరి శ్రీనివాస్ గుండా రాజమల్లు అంకమ్ సతీష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
