24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 6)
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన బీఆర్‌ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డికి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాత మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, పువ్వాడ అజయ్ కుమార్ , రాముల నాయక్ తదితరులతో కలిసి సండ్ర వెంకట వీరయ్య నివాళులర్పించారు. జనగామ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి క్రియాశీలకంగా పని చేసి ఎనలేని సేవలను పార్టీకి అందించారని వారి మరణం బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని సండ్ర వెంకట వీరయ్య కోరుకున్నారు.





