ముస్తాబాద్, నవంబర్18 (24/7న్యూస్ ప్రతినిది) సిరిసిల్ల నియోజకవర్గంలోని బంధనకల్ గ్రామంలో గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకుడు కరెడ్ల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు కలిసి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అభివృద్ధి గురించి ఓటర్లకు వివరిస్తూ సిరిసిల్ల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమకు మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 30, సం.రాలకు పైచిలుకు బిజెపి పార్టీని వీడకుండా పనిచేస్తున్న కస్తూరి గాల్ రెడ్డి, పోలీస్ పటేల్ వెంకన్న, కార్యదర్శి రాజు, సింతాకుల మహేష్, చింతాకుల స్వామి, అధిక సంఖ్యలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
