ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి నవంబర్12, (24/7న్యూస్) మేజర్ గ్రామపంచాయతీ సమీపంలో ప్రతి ఆదివారం వారసంత నిర్వహించడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఓసైడు సొంత మరో సైడు వాహనాల రద్దీ రాకపోకలు ఎదరవడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొని రోడ్ల పైనే తలలు పగిలి రక్తసిక్తమవుతున్న ప్రజలు. ఇకపోతే గ్రామపంచాయతీ అధికారులు హెచ్చరిక బోర్డులు ఉన్నా ఉపయోగించక పోవడంతో పాటు వ్యాపారస్తులు కూడ ఉపయోగించుకునే గూడ్స్ వాహనాలు రాకపోక సైడ్ కు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పార్కింగ్ చేయడం తరచూ ప్రమాదాలకు దారితీస్తుందని వాహనదారులు మండిపడుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు మాత్రం వేలం పేరుతో తైబాజార్ పైకము లక్షల్లో డబ్బులు గుందుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. వేలండబ్బులు మీద ఉన్నంత ప్రేమ వాహనదారుల మీద ఎందుకు విస్మరించారని వాహనదారులు ప్రజలు విమర్శిస్తున్నారు. ఇటు రాకపోకలు అటు వైన్సుల ఎదుట మందు బాబుల వాహనాలు రోడ్లపై ఐరన్ డిపో నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు సంబంధించిన ఇసుక ఇదేం నిర్లక్ష్యమని కొందరు పాలకులు, ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా వారసంతను వాహనాల సైడ్ కు మారుస్తే, వారసంత సైడు రాకపోకలకు ఇబ్బందులు తక్కువవుతావని గ్రామస్తులతోపాటు పలువురు కోరారు.
