ముస్తాబాద్/అక్టోబర్/22; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లొ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షునిగా చెవుల మైలారం యాదవ్,(ఆంధ్రజ్యోతిదినపత్రిక)ప్రధాన కార్యదర్శిగా రాచమడుగు వెంకటేశ్వరరావు(ఎస్ఎస్ కేబుల్) ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో జర్నలిస్టుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలను జర్నలిస్టులు నిర్వహించుకున్నారు. అధ్యక్షునిగా చెవుల మైలారం యాదవ్, ఉపాధ్యక్షులుగా కొల్లూరి శంకర్,(TS 24) చింతల మహేష్,(దిశ) ప్రధాన కార్యదర్శిగా రాచమడుగు వెంకటేశ్వరరావు, కోశాధికారిగా కూర సంతోష్,(నవతెలంగాణ) కార్యదర్శిగా అబ్రమేని దేవేందర్(వెలుగు) సహాయ కార్యదర్శిలుగా పందిర్ల రవికాంత్ గౌడ్,(వార్త దినపత్రిక) రుద్రోజు శ్రీనివాస్,(టైంటుడే) గౌరవ సలహాదారులుగా అవధూత శేఖర్,(సాక్షి దినపత్రిక) తడక లక్ష్మీనారాయణ (సమయజ్యోతి) తోపాటు కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని పాత్రికేయ సోదరులు అభినందించారు. ఇట్టి పదవీకాలం రెండు సంవత్సరాలపాటు కొనసాగనున్నట్లు కమిటీ నిర్ణయించినట్లుగా అద్యక్షులు తెలిపారు. ఈకార్యక్రమంలో గున్నాల పరశురాములు గౌడ్,(అక్షరం) గుండవేని దేవరాజు(తెలంగాణా ఎక్స్ ప్రెస్) కస్తూరి వెంకటరెడ్డి, (జనగొంతుక) జింక పవన్ కుమార్,(ఆదాబ్ హైదరాబాద్) బత్తుల వెంకటేష్(పీపుల్స్ న్యూస్) తదితరులు కలరు.
