– ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్.
దౌల్తాబాద్;
ఆపదలో ఉన్న సాటి మానిషిని ఆదుకోవడమే నిజమైన మానవత్వమని అమ్మ- నాన్నలను కోల్పోయిన యువకునికి మేము సైతం అండగా ఉంటామని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. ఆదివారం దౌల్తాబాద్ మండలం గొడుగు పల్లి గ్రామంలో అమ్మా నాన్నలు కోల్పోయిన మహేష్ కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామానికి చెందిన దుద్దెడ భారతమ్మ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతిచెందగా, ఆమె భర్త బాల్ నర్సయ్య గతంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు.తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో వారి కొడుకు మహేష్ అమ్మనాన్నలు కోల్పోయి ఒంటరి వాడయ్యాడు.రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబంలో కుటుంబ యజమానులు ఇద్దరిని కోల్పోవడం తీరని లోటు. అనారోగ్యంతో తండ్రి రోడ్డు ప్రమాదంలో తల్లి ఇద్దరు మృతి చెందడంతో ఆ యువకుడి బాధ వర్ణనాతీతం.అలాంటి యువకునికి మానవత్వంతో అండగా నిలవాలని ఎస్ఆర్ ఫౌండేషన్ తరుపున బియ్యం, నిత్యవసర సరుకులు అందజేయడం జరిగిందన్నారు. ఇంక మానవతావాదులు ఎవరైనా ముందుకు వచ్చి యువకుడు మహేష్ కు సహాయం చేయగలరని కోరుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు రవీందర్, శ్రీకాంత్,రమేష్,బిక్షపతి, రోహిత్,నరేష్,స్వామి,అనీల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
