ముస్తాబాద్, నవంబర్26 (24/7న్యూస్ ప్రతినిధి) ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాలలోఎంపీపీ జనగామ శరత్ రావు, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు నేతృత్వంలో గడిచిన తొమ్మిది ఏళ్లలో వెన్నుముకగా ఎనలేని సేవలు అందించడం ప్రజల్లో విశేషంమైన ఆదరణ లభించడంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో పలు సంఘాలకు ఆలయాలకు ఆధ్యాత్మికంలో భాగంగా అనేకమైన సేవలందిస్తూ తనసాయ శక్తులతో నూతనంగా నిర్మాణంచేసే ఆలయాలకు విరాళంగా అందిస్తూ ఉండడం విశేషం. రానున్న రోజుల్లో కేటీ రామారావు మన సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిస్తే మెనీపెస్టోలో ప్రవేశపెట్టిన అనేక పథకాలే కాకుండా మరిన్ని పథకాలు కెసిఆర్ అమలు పరిచారని ఓటర్లకు బిఆర్ఎస్ నాయకులు ఇన్చార్జీలు పలు గ్రామాలలో వివరిస్తున్నారు. ప్రతి ఓటరు గమనించి వలసిందిగా తెలంగాణ ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు అనేకమైన అభివృద్ధి పనులను చూసి అమూల్యమైన ఓటును కల్వకుంట్ల తారకరామారావుకు వేసి వారికి మద్దత్తుగా భారీ మెజార్టీతో గెలిపించుకొని ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా చూడాలని ప్రజల్లోకి వెళ్లి ఏకగ్రీవ తీర్మానం చేసుకుంటున్నారు. ఈకార్యక్రమంలో మండలంలోని బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, గ్రామ ఇన్చార్జీలు తదితరులు పాల్గొన్నారు.
