Breaking News కథనాలు ప్రాంతీయం

అంగన్వాడి ఆయా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.. ఏఐటీయూసీ కడారి రాములు డిమాండ్…

295 Views

అంగన్వాడి ఆయా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఏఐటీయూసీ కడారి రాములు డిమాండ్…
ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో అంగన్వాడి ఆయమ్మ అక్కెనపల్లి సత్తెమ్మ గుండెపోటుతో హఠాన్మరణం చెందింది . శుక్రవారంరాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అంగన్వాడి ఆయా లకు సంబంధించిన సమ్మె కాలంలో 20 రోజులు నిరవధిక దీక్షలో పాల్గొన్నదని సత్తెమ్మ ఉద్యోగ భద్రత కావాలని రిటర్మెంట్ బెనిఫిట్స్ కావాలని ప్రమాద బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని కోరారు. ఎన్ని పోరాటాలు చేసినా రిటర్మెంట్ సమయం పడుతున్న సందర్భంలో మరణించిందని ఆవేదన చెందారు కావున ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు కొంతకాలం క్రితం ఆయమ్మ కుమారుడు కూడా మరణించడం జరిగిందని వారి ఒక కుటుంబం దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నదని వారిని విచారించి రిటర్మెంట్ రాయితీ కూడా ఇవ్వాలన్నారు. అంతేకాకుండా ఆమె కోడలుకు ఆయమ్మ పదవి ఇవ్వాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు కోరారు. ఈ కార్యక్రమంలో కొరియర్ క్రాంతి గాజుల దేవయ్య , పోచమ్మ పరామర్శించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *