– బిజెపి నాయకులు అవినీతి చేయరు
– అవినీతి చేసే పార్టీ బీఆర్ఎస్
– కేటీఆర్ పై ఘాటుగా స్పందించిన ఎంపీ ధర్మపురి అరవింద్
దౌల్తాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు ఒక్కటేనని, బిజెపి నాయకులు అవినీతి చెయ్యరని, అవినీతి చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును ఇటీవల దౌల్తాబాద్ లో జరిగిన యువగర్జనలో మంత్రి కేటీఆర్ బూతులు తిట్టడం సరికాదని, మేం కూడా నీకంటే ఎక్కువ బూతులు తిట్టగలమని అన్నారు. అరేయ్ రాముగా దుబ్బాక ఎమ్మెల్యే అని చూడకుండా లుచ్చా అనడం నీకు ఏం పద్ధతి రా అసలు లుచ్చావు నువ్వు నాన్న కేసీఆర్ లుచ్చారా అంటూ ఘాటుగా మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతున్నామని సంకేతాలు రావడంతో కెసిఆర్, కేటీఆర్ ఆగమవుతు పిచ్చి కూతలు కూస్తున్నారని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు లక్షల కోట్లు దోచుకున్నారని, కవిత ఏకంగా లిక్కర్ దందా మొదలు పెట్టిందని అన్నారు. సీఎం కేసీఆర్ నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు, ఉద్యోగాలు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవన్నీ మరిచి తెలంగాణ ప్రజలను మోసగించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని అన్నారు. దుబ్బాక అభివృద్ధికి పాటుపడే రఘునందన్ రావును మరోసారి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
*కేటీఆర్ ఉద్యమ సమయంలో ఎక్కడున్నావు*
దుబ్బాక ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు
తనపై సంస్కారం లేకుండా మాట్లాడిన మంత్రి కేటీఆర్ ఉద్యమ సమయంలో ఎక్కడున్నాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల హాయంలో చేసిన పనులు ఏమిటో చూపించాలని సవాల్ విసిరారు. తాను గెలిచిన తర్వాత దుబ్బాక ప్రజల కోసం కొట్లాడానని, పలురోడ్లకు నిధులు మంజూరు చేయించానని పేర్కొన్నారు. దుబ్బాక ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు… ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు పోతురాజు కిషన్ తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు….




