అప్పరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే ఆల సమక్షంలో భారీగా చేరికలు
అప్పరాల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ చిట్టెమ్మ కేశవులు, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మాసన్న,
4వ వార్డు సభ్యులు ఆంజనేయులు
6వ వార్డు సభ్యులు సుబ్బారావుతో పాటు 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ కారుగుర్తు పార్టీ లో చేరడం జరిగింది
బిఆర్ఎస్ పార్టీలో ఏకమైన అప్పరాల గ్రామం
భారీ ఎత్తున ఎమ్మెల్యేలకు స్వాగతం పలికిన గ్రామస్తులు
మనదంత ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అని అందరం ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని దేవద్రక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు.
శనివారం కొత్తకోట మండలం అప్పరాల గ్రామంలో ఎంపీటీసీ చిట్టెమ్మ కేశవులు , మాజీ సర్పంచి మాసన్న,వార్డు మెంబర్లు సుబ్బారావు ఆంజనేయులు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సురేష్,మొగులన్న,హోటల్ మన్నెం,ఉప్పరి పల్లి చెంద్రన్న, తెలుగు కేశవులు, గోపి,నాగమణి,రజిత,గోపి నాయక్,శాంతమ్మ,మాన్సింగ్ నాయక్ కలిసి గ్రామమంత బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరియు దెవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి కృషితో జరుగుతున్న అభివృద్ధి కి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నట్లు వారు అన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల వాతావరణం మీ గ్రామం నుండే ప్రారంభం అయిందని మీ గ్రామం పెద్ద ఎత్తున మెజార్టీని అందిస్తుంది. ప్రతి ఇంట్లో ఏదొక విదంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. లబ్దిపొందుతున్న ప్రతి ఒక్కరు కేసీఆర్ వెంట ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
