Breaking News ప్రాంతీయం రాజకీయం

బ్యాట్ తో హ్యాట్రిక్ కొడదాం.. లగిశెట్టి శీనన్ననే గెలిపిద్దాం

255 Views

బ్యాట్ తో హ్యాట్రిక్ కొడదాం.. లగిశెట్టి శీనన్ననే గెలిపిద్దాం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శీనన్ననే గెలిపించాలని ఎల్లారెడ్డిపేట మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు గురువారం రోజున గడపగడపకు వెళ్లి బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని నిరంతరం మీ వెంటే ఉంటూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదిస్తే అసెంబ్లీలో తమ గలాన్ని వినిపిస్తామని సిరిసిల్ల జిల్లా సమస్యలను వెల్లడిస్తానని ప్రజా సమస్యల కోసం పోరాడుతానని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం వారి అభ్యున్నతి కోసం పాటుపడతానని పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గొల్లపల్లి అల్మాస్పూర్ గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని చేశారు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మహిళా మణులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *