ప్రాంతీయం

రోడ్ షోలో 6.గ్యారెంటీలతో ప్రస్తావన కేకే…

269 Views

ముస్తాబాద్, నవంబర్ 22 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహవద్ద కాంగ్రెస్ రోడ్ షో నిర్వహించిన కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రైతుబంధు బంద్ అవుతుందని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు సైతం భరోసా ఇస్తామని.. ఉపాధిహామీ కూలీకి వెళ్లే ప్రతిఒక్కరికీ ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారు. 2004లో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ.. మేము అధికారంలోకి వస్తే 24. గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతే 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే ఇళ్లకు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తామన్నారు. ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ తోపాటు అనేక పథకాలు ప్రవేశపెట్టిందని సోనియాగాందీ అన్నారు. రాష్ట్రంలోని సర్పంచ్‌లంతా ఆలోచన చేయాలని.. అప్పులు తెచ్చిన డబ్బులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చేపడితే చేతిలో చిల్లిగవ్వలేక పుస్తెలు తాకట్టుపెట్టి ఆపై బిల్లురాక భూములు ఉన్నవాళ్ళు భూములను అమ్ముకున్నారు. భూములు లేని సర్పంచులు ఉరితాళ్ళకు వేళాడుతున్న పరిస్థితి నెలకొంది వారి భార్యాపిల్లల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక బాగుపడతాము అనుకుంటే కేవలం మండలానికి బాగుపడ్డది నలుగురే.. ఇకపోతే దినసరి కూలీ పనులపై వెళ్లగా ఇంటి దగ్గర పసిమొగ్గలు సాయంత్రం వరకు మాడాడీ ఏమో తెస్తాడని ఎదురు చూస్తూంటే ఆతండ్రీ కూలీపనులు ముగించుకొని ఇంటికి పోకమునుపే కూలీ డబ్బులు లిక్కర్ కే పాయె.. పిల్లలు చూసిచూసి నిద్రపాయే.. రాస్టంలో ఏ ఊరికిపోయినా వాడవాడకు బెల్ట్ షాపులు పెట్టించిన ఇదిబంగారు తెలంగాణ పరిస్థితి అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, ఎంపీటీసీ గుండెల్లీ శ్రీనివాస్ గౌడ్, కనమేని చక్రధర్ రెడ్డి, ఒరగంటి తిరుపతి, దీటి నర్సింలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *