మర్కుక్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను పరిశీలించిన గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్
సిద్దిపేట జిల్లా మార్కుక్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమం ను పరిశీలించిన మార్కుక్ గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ .ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమం లొ స్త్రీ ల కు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు,సుగర్ ,బీపీ, కీళ్ల నొప్పులు,రుతు సమస్యలు థైరాయిడ్,క్యాన్సర్ తదితర ఆరోగ్య సమస్యలకి ప్రత్యేకంగా రక్త పరీక్షలు చేసి వైద్యం అందించ బడును. వైద్యాధకారులు ,డాక్టర్ శశి శ్రీ డాక్టర్ శ్రీనివాస్, ఆశ లు మరియు ఏ ఎన్ ఎం ఎస్ పాల్గొన్నారు





