దౌల్తాబాద్: అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తనయుడు కొత్త పృథ్వి కృష్ణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని తిరుమలాపూర్, మహమ్మద్ షాపూర్, కోనాపూర్, శేరి పల్లి, బందారం, నర్సంపేట, హైమద్ నగర్, మల్లేశం పల్లి, శౌరిపూర్ ముబారస్ పూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి మోసపూరిత మాటలు చెబుతున్నాయని నమ్మితే ఆగం చేస్తారని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించకుండా 72 ఏళ్లు పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏ ముఖం పెట్టుకొని గ్రామాల్లో ఓట్లు అడగడానికి వస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్ గల్లంతవ్వడం ఖాయమన్నారు. ఎన్నికల సమయంలో బిజెపి బీసీ అభ్యర్థి సీఎం చేస్తామంటూ బూటకపు హామీలు ఇస్తుందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం 2000 కోట్లు మాత్రమే కేటాయించిన బిజెపి బీసీల గురించి మాట్లాడడం ఆస్యాస్పదంగా ఉందన్నారు. వారంటీ లేని గ్యారంటీ పథకాలను నమ్మ వద్దన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారన్నారు. తెలంగాణలో అద్భుతమైన పథకాలు ఉన్నాయని ఈ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. బిఆర్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్, జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు రహీముద్దీన్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు భాగ్య ఎల్లం, స్వప్న జనార్దన్ రెడ్డి, స్వప్న పూర్ణయ్య, దార సత్యనారాయణ, ఇమాంబి, యాదగిరి, ఎంపీటీసీలు జోడు నవీన్ కుమార్, బండారు దేవేందర్, తిరుపతి, శేఖర్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజి రెడ్డి, బీఆర్ఎస్ గ్రామాల అధ్యక్షులు స్వామి, కనకయ్య తోపాటు ఆయాగ్రాముల సర్పంచులు, ఎంపిటిసిలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు….
