రాజకీయం

కాంగ్రెస్ లోకి నూస్తులపూర్ ఎంపిటిసి

309 Views

(తిమ్మాపూర్ నవంబర్ 23)

బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి చేరికలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో బీఆర్ఎస్ పార్టీకి తలనోప్పిగా మారింది. పార్టీ మారుతున్న వారి వివరాలు ముందుగా తెలిసినా వారిని అదుపుచేయడంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం విఫలం కావడంతో చేరికల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తిమ్మాపూర్ మండలం నూస్తులపూర్ గ్రామ ఎంపిటిసి కొత్త తిరుపతి రెడ్డి తో పాటు తెలంగాణ ఉద్యమకారుడు నూస్తులపూర్ సొసైటీ మాజీ చైర్మన్ అల్వాల్ కోటి బుధవారం రాత్రి మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి కవ్వంపల్లి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ…

కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, మన ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *