తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేల టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది. దానిలో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవంబర్ 30న జరిగే పోలింగ్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని చెన్నూర్ నియోజకవర్గ ప్రజలను కోరారు.






