-ఎఐఎవైఎస్ మండల అధ్యక్షులు పారునంది జలపతి
(తిమ్మాపూర్ డిసెంబర్ 14)
ఇటీవలే పార్లమెంటు సమావేశలు జరుగుతున్న సమయంలో కొందరు దుండగులు పార్లమెంటు భవనం లోపలికి చొచ్చుకొని వెళ్లి టియర్ గ్యాస్ ను వదిలి నానా అంగమ సృష్టించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
గతంలో ఇదే రోజున 2001లో కొందరు ముష్కరులు పార్లమెంటుపై ఉగ్ర దాడి చేసి కొంతమంది భద్రత సిబ్బందిని పొట్టన పెట్టుకున్నారు. మళ్లీ 22 ఏళ్ల తర్వాత అదే రోజున పార్లమెంట్ పై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. భారతదేశానికి అత్యున్నతమైన చట్టాలను చేసే పార్లమెంటు భవనంపై దుండగుల దాడి ఒక మచ్చగా మిగులుతుందని,దాడిలో భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తుందని, ఈ ఘటనకు కారణమైన దుండగులను వెంటనే అరెస్టు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.




