ప్రాంతీయం

తొలి సంతకం 6.గ్యారెంటీల మీదనే కాంగ్రెస్…

327 Views

ముస్తాబాద్, నవంబర్ 20, (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు ఒకేచోట గ్యాదరై మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా పట్టణ అధ్యక్షుడు గజ్జలరాజు ఆధ్వర్యంలో 6,గ్యారంటీలతో సోనియాగాంధీ ప్రవేశపెట్టిన పథకాలను తెలియపరుస్తూ ఇప్పటికీ ఏ ప్రభుత్వం ఇవ్వని పథకాలతో పాటు నాడు తెలంగాణను ఇచ్చిన తల్లి సోనియా అదేమాదిరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను మరువలేనివన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతున్న విషయం యూట్యూబ్లో చెక్కర్లు కొడుతున్న విషయం విధితమే రుణమాఫీలు, పింఛన్లు, రైతులకు ఉచితకరెంటు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిండని అంటూ మేము డబ్బాలు కొట్టుకోమని సీఎంకేసీఆర్ ఒప్పుకున్నారన్నారు. ఈమాటచాలదా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిదర్శనం అన్నారు. 50 సంవత్సరాల నుంచి ఏంచేసిందని మంత్రి కేటీఆర్  గ్యారడి మాటలు విని విని ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అసలు మేము అడుగుతున్నాం 50ఏళ్ల నుండి కాంగ్రెస్ అధికారంలో ఉండి ఏంచేసిందని కేటీ రామారావు అన్నారుకదా 50, ఏళ్లకింద నీవు పుట్టావా కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత మీకు మీ పందికి లేదు తరతరాల నుంచి స్థిరస్థాయిగా గాంధీ కుటుంబం ఇందిరమ్మ, ఇల్లు ఊరూరా గాంధీ, ఇంద్రమ్మ విగ్రహాలు పేరు నిలబెట్టుకునె వంశం సోనియమ్మదన్నారు. పట్టుమని10,ఏండ్లు కాలేదు నీవు రాజకీయంలోకి వచ్చి తెలంగాణలో నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయం చేసినంత వయసు లేదు ఆయన నిరుపేదలకు ఉపాధి పేరుతో ఉపాధి చూయించి ఏక కాలంలోనే రైతులకు రుణమాఫీతో పాటు 2,వందలు పింఛన్ మొదలుకొని నేడు 2, వేలకు పెరిగిందంటే ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే మొదలు పెట్టిందన్నారు. 2,వేలపింఛన్ కాకుండా 4వేల.పింఛను ఇస్తూ మహిళలకు ఉచిత బస్సుపాసును 5.వందలకే గ్యాస్ సిలిండర్, 2.వందల యూనిట్లవరకు కరెంటుబిల్లు ఉచితం, ఏకకాలంలోనే రైతులకు 2.లక్షల రుణమాఫీ, ఇంటివద్దనున్న ఉన్న మహిళలకు 25 వందలు ఖర్చులకు ఇన్నిస్తుండంగా ఇంకేమి కావాలి అన్నారు.12, వందల పైచిలుకుమంది ఆత్మ బలిదానాలతో తెలంగాణవస్తే నాడు కెసిఆర్ ఇంటికో ఉద్యోగమనిచెప్పి చెప్పిందొకటి చేసేదొకటి మొదటగా సీఎం కాకుండానే దళిత సీఎం, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తానని కుర్చీ దక్కించుకుని కుటుంబ పాలన చేసేది మీరుకాదానన్నారు, రెండోసారి రుణమాఫీ చేస్తానని తుంగలో తొక్కేశావు, మా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియాగాంధీ ప్రవేశపెట్టిన పథకాలను అన్ని కూడాకాదు కొన్ని మాత్రమే కాపీకొట్టి ప్రజలకు ప్రస్తావించడంలో ఎవరు నమ్మేటందుకు లేరన్నారు. పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి 400,కో సిలిండర్ ఎందుకు ఇయ్యలేదు ప్రతిపక్షాలు మాట్లాడగానే అధికారం ఏడ పోతుందని భయపడింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అన్నారు. మళ్లీ రుణమాఫీపేరు ఎత్తుతెనే ప్రజల్లో వ్యతిరేక మస్తుందన కప్పిపుచ్చుతూ ఎన్నేళ్ళుమోసం చేస్తారు అన్నారు. మాప్రభుత్వం ప్రజలు మాపక్షాన ఉన్నారన్నారు. వస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ దే దీమా వ్యక్తం చేశారు. ఈ ఒక్కసారి కాంగ్రెస్ చేయి గుర్తుకు ప్రజలు మాపక్షాన ఓటువేసి గెలిపిస్తారని ప్రగాఢ నమ్మకం మాకుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇస్తానన్న వాగ్దానాల మొదటి సంతకం ఆరు గ్యారెంటీల మీదనే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, దీటి నర్సింలు, ఎదునూరి భానుచందర్, మాజీ ఎంపిటిసి రాజం,  గ్రామశాఖ అధ్యక్షులు రాజిరెడ్డి, భాను, మల్లేశ్ గౌడ్, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు గోవర్ధన్ నాయక్, ఎస్టి సెల్ గ్రామఅధ్యక్షుడు మున్యా నాయక్, కొండయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *