కూచిపూడి ప్రదర్శనలో విద్యార్థిని అద్భుతమైన ప్రదర్శన.
సిద్దిపేట జిల్లా జనవరి 4, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన వెల్దండి సంజయ్ సుమిత్ర ల కుమార్తె చిన్నారి వెల్దండి దేవాన్షిత కూచిపూడి నాట్యంలో అద్భుతమైన ప్రదర్శన ఇస్తూ తేదీ 04 -01 2026 ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్టములోని కాకినాడ, అన్నవరం దేవస్థానములో చిన్నారి వెల్డండి దేవాన్షిత ఇచ్చిన కూచిపూడి నాట్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. చిన్నారి దేవాన్షిత కు ప్రశంసా పత్రంతో పాటు షీల్డ్ అందజేశారు. హుస్నాబాద్ పట్టణములోని స్థానిక సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ప్రస్తుతం 4వ,తరగతిచదువుతుంది.నాట్యం పైన మక్కువతో హుస్నాబాద్ పట్టణములోని గీతమందిర్ లో ప్రతి శనివారము, ఆదివారము పద్మనయన కూచిపూడి నాట్య మండలి వారు ఆచార్య కిరణ్ కుమార్ స్టేషన్ జనగామ వాస్తవ్యులు అద్వర్యం లో శిక్షణ పొంది వివిధ దేవాలయం లో ప్రదర్శనలు ప్రదర్శించారు.





