ఇంటికి పెద్ద కొడుకుల ప్రతి ఇంటికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మా పెద్ద కొడుకు లాంటివాడు కెసిఆర్ అని మహిళ అన్నది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎంపీటీసీ పందిర్ల నాగరాణి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఓ మహిళ వద్దకు వెళ్లి కెసిఆర్ ఏం చేసిండు అమ్మ అని అడగగానే వెంటనే మనసులో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ఎవరేమీ అన్నా సరే నేను కారు గుర్తుకే ఓటు వేస్తానని తేల్చి చెప్పేసింది.
