అధికారంలోకి వచ్చాక అవినీతి సొమ్మును కక్కిస్తాం
– సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి
ఎల్లారెడ్డిపేట, ప్రజాపక్షం/: అధికారంలోకి రాగానే అవినీతి సొమ్మును కక్కిస్తాం అవినీతి పాలనను అంతమొందిస్తాం ఈ అరాచక పాలనను సహించేది లేదని తెలంగాణ పొలిమేర వరకు బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడం జరుగుతుందని సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు షో నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ రైతులను మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కిందని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను కల్లు తాగిన కోతుల్లాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మండలానికి నలుగురు మాత్రమే బాగుపడతారని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజలు అందరూ బాగుపడతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వరి ధాన్యం రైతులకు తాలు తేమశాతం లేకుండా వరి ధాన్యాన్ని కొంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో గ్రూప్ వన్ పరీక్షలు లీక్ అయ్యి విద్యార్థిని,విద్యార్థులు ఉద్యోగాలు రాక రోడ్డున పడ్డారని వారి గోస తప్పకుండా తగులుతుందని అన్నారు. తను ఈ ప్రాంతం నుంచి రెండుసార్లు ఓడిపోవడం జరిగిందని అయినా నేను నిరాశ పడకుండా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మీ మధ్యనే గడుపుతున్న నన్ను ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని వేడుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కున్న భూములను స్వాధీనం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వెంటనే తిరిగి వారికి అప్పజెప్పడం జరుగుతుందని స్పష్టం చేశారు. పేద బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేయడానికి తల్లి సోనియా గాంధీ తనను సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపారని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి చేతి గుర్తుకు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండూరు గాంధీరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, షేక్, పసుల కృష్ణ, ఒగ్గు బాలరాజు యాదవ్ పాల్గొన్నారు.
21SRCL126
అనిల్ 8500821386




