
జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రాత్రి ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.పాఠశాల వార్షికోత్సవం కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,ఏసీపీ రమేష్, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్,ఎంఇఓ ఉదయ బాస్కర్, సర్పంచ్ భానుప్రకాష్ రావు, పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల నాయకులు హాజరయ్యారు.తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ద్వితీయ వార్షికోత్సవం ను ప్రారంభించారు.వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆట పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామస్థులు యువకులు తదితరులు పాల్గొన్నారు




