ముస్తాబాద్, నవంబర్ 21 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ రోడ్‌షోలో ఈ మధ్యాహ్నం మూడు గంటల మినహా పాల్గొననున్నారు. నేటి ఉదయం నుండి జరుగనున్న ఈకాక్రమానికి మంగళవారం ముస్తాబాద్ లో బిఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్తాబాద్ మండలం వివిధ గ్రామాల నుండి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కోరారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తోటఆగయ్యతో పాటు మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బొంపెల్లి సురేందర్ రావు, సీనియర్ నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్, చెవుల మల్లేష్ యాదవ్, జిల్లా మాజీ ఆప్షన్ సర్వర్ పాషా, మండలమాజీ కోఆప్షన్ అన్వర్, అల్లం లక్ష్మణ్, కనమేని శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తితో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
