రాజకీయం

బిఆర్ యస్ శ్రేణుల్లో రోజురోజుకి పెరుగుతున్న జోష్…..

263 Views

అలంపూర్ నవంబర్ 21: అలంపూర్ గడ్డ చల్లా అడ్డా ఉమ్మడి వడ్డేపల్లి శ్రీనన్న అడ్డా అంటూ జేజేలు కోడుతున్న జనo.
బీఆర్ఎస్ శ్రేణుల్లో రోజురోజుకు పెరుగుతున్న జోష్..

డబ్బులకు,నోట్ల కట్టలకు అమ్ముడుపోయే వాళ్ళం కాదు మేము గులాబీ జెండా సైనికులం.

కాంగ్రెస్, బీజేపీ పార్టీల దొంగ హామీలను నమ్మం అంటున్న అలంపూర్ నియోజకవర్గ ప్రజలు.

అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని పెద్ద తాండ్రపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వడ్డేపల్లి శ్రీనివాసులు బిఆర్ఎస్ పార్టీ అలంపూర్ అభ్యర్థి గ్రామాలలో పర్యటిస్తూ కెసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఎన్నికల ప్రచారంలో వివరిస్తూ ప్రజల మధ్యకు వెళ్తున్నారు.

పెద్ద తాండ్రపాడు గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వడ్డేపల్లి శ్రీనివాసులు ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు.

వడ్డేపల్లి శ్రీనివాసులుని మరియు ఎమ్మెల్యే నాయకులు ఘనంగా సత్కరించారు

వైస్ యంపిపి కొంకల చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతు…

మేనిఫెస్టోలో ఆసరా పెన్షన్లు, రైతుబంధు డబ్బుల పెంపుతో పాటు మహిళల కోసం ప్రత్యేక స్కీమ్లు ప్రకటించారాని, అర్హులైన మహిళలకు నెల నెలా జీవన భృతి అందిస్తామని, అలాగే పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తామని హామీ ఇచ్చారు. తెల్లకార్డు కలిగి ఉన్న ప్రతి పేదఇంటికి రైతుబీమా తరహాలోనే ఎల్ఐసి ద్వారా 5 లక్షల జీవిత బీమా, ఆసరా పెన్షన్లు 5వేలకు పెంచినట్లు అయన తెలిపారు.

ఈనెల 30న కారు గుర్తుకు ఓటు వేసి సీఎంగా కేసీఆర్ ని, ఎమ్మెల్యేగా కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి,వేయించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ముండ్లదీన్నే గ్రామ సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి వడ్డేపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎన్ వడ్డేపల్లి అజయ్ కుమార్ , వల్లూరు ఎంపీటీసీ రవి తాండ్రపాడు సురేష్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *