రాజకీయం

కర్నాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ ను కలిసిన వెంకట్ రెడ్డి,

478 Views

కర్నాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ ను కలిసిన వెంకట్ రెడ్డి,

ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 09 :

కర్నాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ ను ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు,
గతంలో కాంగ్రెస్ పార్టీ లో పనిచేసిన మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి రాష్ట్ర మాజీ మంత్రి కెటిఆర్ ఆద్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు,
ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ లో పని చేస్తున్న వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారు,
బిఆర్ఎస్ పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటున్న వెంకట్ రెడ్డి ఇప్పటికే మంత్రులు శ్రీధర్ బాబు ను పొన్నం ప్రభాకర్ గౌడ్ ను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను కలిసినట్లు సమాచారం,
వెంకట్ రెడ్డి ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలతో పాటు వివిధ మండలాలకు చెందిన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు ,
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులతో వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది,
కరీంనగర్ జిల్లా కు చెందిన సింగిల్ విండో అధ్యక్షులు దుర్గారెడ్డి , వెంకట్ రెడ్డి బెంగళూరు లో ఉన్న డికే శివకుమార్ ను గురువారం రాత్రి కలిసి వచ్చారు,

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *