చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఏకకాలంలో ఐటీ సోదాలు ఉదయం ఐదు గంటలకి మొదలయ్యాయి.
ఒకేసారి హైదరాబాద్ మరియు మంచిర్యాల లోని తన నివాసంలో ఐదు అధికారులు సోదాలు చేస్తున్నారు. గత కొంతకాలం నుండి తన కంపెనీ డబ్బును ఓటర్లను కొనేందుకు తరలిస్తున్నారు అనే ఆరోపణ రావడంతో ఐటీ అధికారులు ఏకకాలంలో హైదరాబాద్ మరియు మంచిర్యాల నివాసాలలో ఐటీ సోదరులు చేపట్టారు.
ఇటీవలే గడ్డం వివేక్ డబ్బు ఎనిమిది కోట్ల రూపాయలను పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. అదేవిధంగా గడ్డం వివేక్, వినోద్ ఇంట్లో తో పాటు తమ కూతుర్ల ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు గడ్డం వివేక్ నివాసానికి చేరుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐటీ దాడులను ఖండిస్తున్నారు.





