రాజకీయం

యువగర్జనను విజయవంతం చేయాలి

249 Views

– నేడు యువగర్జనకు కేటీఆర్ రాక

దౌల్తాబాద్: నేడు దౌల్తాబాద్ లో నిర్వహించే దుబ్బాక నియోజకవర్గ యువగర్జనను విజయవంతం చేయాలని జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్ అన్నారు. సోమవారం యువ గర్జన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మధ్యాహ్నం 1 గంటలకు దౌల్తాబాద్ లో యువగర్జనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి లు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గం లోని అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేందర్, కలీలుద్దీన్, నాగరాజు, స్వామి, శేఖర్, రాజలింగం గౌడ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు…

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *