కార్యకర్తల సహకారంతో ప్రజా దీవెనలతో గెలిచి నియోజ కవర్గం అభివృద్ధికి పాటు పడుతా
ములుగు జిల్లా,వెంకటాపూర్,సెప్టెంబర్ 23
వెంకటాపుర్ మండలం కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజేశ్వరావుపల్లి సర్పంచ్ వేములపల్లి రవీందర్ బీఆర్ఎస్ పార్టీలో చేరగా ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గులాబీ కండు వా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం బడే నాగజ్యోతి మాట్లాడుతూ
రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులయ్యే చాలా మంది టీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రోల్డ్ మోడల్ గా నిలి చిందన్నారు.గత ప్రభుత్వాలు తెలంగాణను విస్మరించి అభివృద్ధిని అడ్డుకున్నాయని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాలలోనే సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దారని తెలిపారు.
ప్రజాల ఆశీర్వాదంతో గెలిచి
కార్యకర్తల సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ మండల అధ్యక్షుడు రమణా రెడ్డి,ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య,జిల్లా నాయకులు మల్క రమేష్,సీనియర్ నాయకులు కూరేళ్ల రామ చారి,చెన్న విజయ్,భిక్షపతి గౌడ్,రామసహయం శ్రీనివాస్ రెడ్డి,కోగల మహేష్,ఎంపీ టీసీలు,సర్పంచ్ లు,ముఖ్య నాయకులు,సీనియర్ నాయ కులు,కార్యకర్తలు ఉన్నారు.