ముస్తాబాద్/అక్టోబర్/20; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మొర్రాయిపల్లి గ్రామంలో డబల్ బెడ్ రూములు మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ మండలశాఖ ఆధ్వర్యంలో మొర్రాయిపల్లి గ్రామపంచాయతీ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల అధ్యక్షుడు కస్తూరికార్తీక్ రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుండి డబల్ బెడ్ రూమ్ లు మంజూరు చేస్తామంటూ మాటిచ్చి ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కేటీఆర్ వెంటనే డబుల్ బెడ్ రూములు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూన్నామని ఈసందర్భంగా తెలియజేశారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు కోల కృష్ణగౌడ్, సౌళ్ళ క్రాంతి, టౌన్ ప్రెసిడెంట్ మహేందర్, బీజేవైఎం మండల అధ్యక్షులు కుడుకల జనార్ధన్, బిజెపి ఉపాధ్యక్షులు ఆదిశేఖర్, సీనియర్ నాయకులు గూడబాల్ రెడ్డి, కరెడ్ల మల్లారెడ్డి, చిట్నేని శ్రీనివాసరావు, నరేష్, మొర్రాయిపల్లి గ్రామశాఖ అధ్యక్షులు వేణు, ముస్తాబాద్ మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు తిరుపతి, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు మల్లేశం, కిట్టు, సతీష్, వేణు, వెంకటేష్, కార్తీక్, రమేష్, కళ్యాణ్,బాబు,అజయ్, బాలాజీ, సంజీవ్, మల్లేష్, మహేష్, నాగరాజు, శ్రీకాంత్, సాయి, స్రుజిత్, బిజెపి కార్యకర్తలు గ్రామప్రజలు పాల్గొన్నారు.




