రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లగిషెట్టి శ్రీనివాస్ తో పాటు మరికొందరి నేతలతో కలిసి బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడుకి పంపినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మోడీ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుదినై, బండి సంజయ్ తనకు పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించడంతో పాటు సిరిసిల్ల టికెట్టు ఇస్తానని హామీ ఇవ్వడం వల్ల బిఆర్ఎస్ పార్టీని వీడి బిజెపిలో చేరినట్లు తెలిపారు. బిజెపి బిసిలకు పెద్దపీట వేస్తుందని నమ్మి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తీరా ఎన్నికల సమయంలో స్థానికులకు టికెట్టు ఇవ్వకుండా ప్యారశుట్ లీడర్ రాణి రుద్రమకు సిరిసిల్ల టికెట్టు అధిష్టానం ప్రకటించారని మండిపడ్డారు. 90 శాతం ఉన్న పద్మశాలి వర్గాన్ని విస్మరించి, స్థానికేతరులకు టికెట్టు కేటాయించడాన్ని విమర్శించారు. అందువల్లే బిజెపి పార్టీకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా సిరిసిల్ల బరిలో ఉంటున్నట్లు తెలిపారు. ఒక బిసి బిడ్డగా తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
