రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన యువ స్వర్ణకారుడు సూక్ష్మ బంగారు వరల్డ్ కప్ ను తయారు చేశాడు. శనివారం మండల కేంద్రానికి చెందిన శ్రీగాద సంతోష్ అనే స్వర్ణకారుడు వరల్డ్ కప్ టోర్నీలో భారత్ టీమిండియా ఆస్ట్రేలియాతో రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో గెలవాలని ఆకాంక్షిస్తూ బంగారంతో అర సెంటీమీటర్ ఎత్తు గల వరల్డ్ కప్ ను తన కల నైపుణ్యంతో కేవలం 30 నిమిషాల వ్యవధిలో తయారుచేసి తన సృజనాత్మకతను వెలికి తీశాడు. స్వర్ణకారుడు సంతోష్ 80మిల్లీల బంగారంతో వరల్డ్ కప్ ను తయారు చేసి క్రికెట్ పై ఉన్న అభిమానాన్ని చాటారు.ఈ సందర్భంగా సంతోష్ ను క్రికెట్ అభిమానులు అభినందిస్తున్నారు.




